జిలి బిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైన మైన
కిల కిల నగవుల వలపులు చిలికిన ఓ మైన మైన
మిలమిల మెరిసిన తార మిన్నుల విడిన సితార
మిలమిల మెరిసిన తార మిన్నుల విడిన సితార
మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైన ఓ మైన
కలలను పెంచకు కలతను దాచకు ఏమైన ఓ మైన
అడగనులే చిరునామా ఓ మైన ఓ మైన
చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నాకైనా
తారలకే సిగపువ్వ తారాడే సిరిమువ్వ
తారలకే సిగపువ్వ తారాడే సిరిమువ్వ
హరివిల్లు రంగుల్లో వర్ణాలే
చిలికిన చిలకవు ఉలకవు పలకవు ఓ మైన ఏమైన
ఉరుములలో అలికిడిలా వినిపించే ఈ మైన
మెరుపులలో నిలకడగా కనిపించే ఈ మైన
యెండలకే అల్లాడే వెన్నలలో త్రినీడ
యెండలకే అల్లాడే వెన్నలలో త్రినీడ
వినువీధి వీణల్లొ రాగంలా
ఆశల ముంగిట ఊహల ముగ్గులు నిలిపేన ఏమైన
జిలి బిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైన మైన
తొలకరి వయసుల మిణుగురు సొగసులాడేమైన మైన
మిలి మిల మెరిసిన తార మిన్నుల విడిన సితార
గుడికే చేరని దీపం పడమటి సంధ్యా రాగం
మధువుల పెదవులు మమతలు విరిసిన ఓ మైన ఓ మైన
చుక్కలు అందక దిక్కున దాగిన నేనేలే ఆ మైన
No comments:
Post a Comment