Friday, July 9, 2010

గుండెల్లో- Golimar

Movie: Golimar
Music: Chakri
Playback: Chakri, Kousalya

గుండెల్లో ఏదో సడి ఉండుండీ ఓ అలజడి
కళ్ళల్లో నువు కలబడి కమ్మేస్తోందీ సందడి
నా ప్రాణం కోరింది నన్నే నీతోనే ఉంటానని
ఆనందం అంటోంది నాతో నువ్వుంటే వస్తానని
తూనీగల్లె మారింది హృదయం నువ్వే కనపడి
తుళ్ళీ తుళ్ళి పొతోంది ప్రాయం తెలుసా తడబడి

నా పెదవంచులో నీ పిలుపున్నది
నీ అరచేతిలో నా బతుకున్నది
ఇన్నాళ్ళెంత పిచోణ్ణి నేను మనసిస్తుంటె తప్పించుకున్నా
మొత్తం మీద విసిగించి నిన్ను ఎదో లాగ దక్కించుకున్నా
మనసున్నాది ఇచ్చేందుకే కనులున్నాయి కలిపేందుకే
అని తెలిసాక నీ ప్రేమలో పడిపోయానులే

నీ కౌగిళ్ళలో నా తల వాల్చనీ
నీ గిలిగింతలో నే పులకించనీ
నాకో తోడు కావాలి అంటూ ఎపుడూ ఎందుకనిపించలేదు
ఒద్దోద్దంటు నే మొత్తుకున్నా మనసే వచ్చి నడిచింది నీతో
కన్నీళ్ళొస్తె తుడిచేందుకు సంతోషాన్ని పంచేందుకు
ఎవరూ లేని జన్మెందుకు అనిపించిందిలే

Wednesday, June 16, 2010

బంగారుకొండ- సింహ

Movie- Simha
Music- Chakri
Lyricist- Chandrabose
Playback- Hariharan, Kousalya


బంగారుకొండ మరుమల్లె దండ మనసైన అండ నువ్వేరా
కనుపాప నిండా నీ రూపు నిండ నా బ్రతుకు పండ రావేరా
స్వాసించలేను నిను చూడకుండా జీవించలేను నిను చేరకుండా
ఏకాంత సరసాలు సాయంత్ర సరదాలు హేమంత రగాలు పలికించు ప్రియుడా
గోరంత విరహాలు కొండంత మురిపాలు జల్లంత జలసాలు జరిపించు ఘనుడా
నీ అడుగుజాడ అది నాకు మేడ

ఈ మహరాజు చిరునవ్వులే నా మణిహారమనుకొందునా
ఈ వనరాణి కొనచూపులే నా ధనధాన్యమనిపించనా
నువ్వే నువ్వే నరసింహ స్తొత్రం ఒడిలో గుడిలో వల్లించనా
నువ్వై రావే గాయత్రి మంత్రం పగలు రేయి జపియించనా
నీ కరుణ కిరణాలు హృదయాన ఉదయాలు నీ వెంటే నా మనుగడ
నీ గుండె నా తలగడ

నీ మీసాల గిలిగింతకే ఆ మోసాలు మొదలాయెనా
నీ మునివేళ్ళ తగిలింతకే ఆ మునిమాపు కదలాయెనా
నీకే నీకే సొగసాభిషేకం నిమిషం నిమిషం చేయించనా
నీతో తనువు మనసే మమేకం మనదో లోకం అనిపించనా
సంసార కావ్యాలు సంస్కార కార్యాలు కలగలపు గుణవంతుడా
కలియుగపు భగవంతుడా

Monday, February 22, 2010

ఆలై పొంగెరా- Sakhi

Movie: Sakhi
Music: AR Rehman


ఆలై పొంగెరా కన్నా మానసమలై పొంగెరా
ఆనంద మోహన వేణుగానమున
ఆలాపనే కన్నా మానసమలై పొంగెరా
నీ నవరస మోహన వేణుగానమది
ఆలై పొంగెరా కన్నా…

నిలబడి వింటూనే చిత్తరువైనాను
నిలబడి వింటూనే చిత్తరువైనాను
కాలమాగినది రా దొరా
ప్రాయమున యమున మురళీధర యవ్వనమలై పొంగెరా కన్నా...

కనుల వెన్నెల పట్టపగల్ పాల్చిలుకగా
కలువ రేకుల మంచు ముత్యాలు వెలిగే
కన్నె మోమున కనుబొమ్మలటు పొంగే
కాదిలి వేణుగానం కానడ పలికే
కాదిలి వేణుగానం కానడ పలికే
కన్నె వయసు కళలొలికే వేళలో
కన్నె సొగసు ఒక విధమై ఒరిగెలే

అనంతమనాది వసంత పదాల సరాగ సరాల స్వరానివా
నిషాంత మహీజ శకుంతమరంద మెడారి గళాన వర్షించవా
ఒక సుగంధ వనాన సుఖాల క్షణాన వరించి కౌగిళ్ళు బిగించవా
సుగంధ వనాన సుఖాల క్షణాన వరించి కౌగిళ్ళు బిగించవా

కడలికి అలలకు కధకళి కళలిడు శశి కిరణమువలె చలించవా
చిగురు సొగసులను కలిరుటాకులకు రవికిరణాలే రచించవా
కవిత మదిని రగిలె ఆవేదన ఇతర భామలకు లేని వేదనో
కవిత మదిని రగిలె ఆవేదన ఇతర భామలకు లేని వేదనో
ఇది తగునో ఎద తగవో ఇది ధర్మం అవునా
ఇది తగునో ఎద తగవో ఇది ధర్మం అవునా
కొసరి ఊదు వేణువున వలపులే చిలుకు మధుర గాయమిది గేయము పలుకగ

ఆలై పొంగెరా కన్నా మానసమలై పొంగెరా
నీ ఆనంద మోహన వేణుగానమున
ఆలాపనే కన్నా… కన్నా…

Saturday, February 20, 2010

నిన్ను నన్ను- మరో చరిత్ర(న్యూ)

Movie: Maro charitra
Music: Mickey J Mayer


నిన్ను నన్ను చెరో జాగాలలో అటు ఇటు పడేసినా ప్రతి క్షణం మదే ఇలా స్మరించినా
నిన్ను నన్ను చెరో జాగాలలో అటు ఇటు పడేసినా ప్రతి క్షణం మదే ఇలా స్మరించినా

ప్రపంచమే వేలేసినా వెలేయని జ్ఞాపకమా
కనే కలే కన్నీరయే నిజాలుగ మారకుమా
గతించిన క్షణాలనే ముడేసిన ఆ వారమా
విధే ఇలా వలేసినా జయించును ఆ ప్రేమ

నిన్ను నన్ను చెరో జాగాలలో అటు ఇటు పడేసినా ప్రతి క్షణం మదే ఇలా స్మరించినా
నిన్ను నన్ను చెరో జాగాలలో అటు ఇటు పడేసినా ప్రతి క్షణం మదే ఇలా స్మరించినా

నా మనసే వీరిసే స్వరాలుగా
గతానికే నివాళిగా పదాలు పాడనీ
ఇవాళ నా ఉషోదయం జాగాలు చూడనీ
ప్రతీ కల ఉగాదిలా సుమాలు పూయనీ

Saturday, February 6, 2010

హోసన్న- ఏ మాయ చేసావే

Movie: Ye maaya chesave
Music: AR Rehman

ఈ హృదయం కరిగించి వెళ్లకే
నా మరు హృదయం అది నిన్ను వదలదే

ఎంతమంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్నా ఈ గుండెకేమవ్వలా.
ఓ నిన్న కాక మొన్న వచ్చి ఏ మాయా చేశావే పిల్లిమొగ్గలేసిందిలా
హోసన్న, గాలుల్లో నీ వాసనా
హోసన్న, పూవుల్లో నిను చూసినా
ఏ సందు మారినా ఈ తంతు మారునా
నావల్ల కాదు ఇంక నన్ను నేను ఎంత ఆపినా
హోసన్న, ఊపిరినే వదిలేస్తున్నా
హోసన్న, ఊహల్లో జీవిస్తున్నా
హోసన్న, ఊపిరినే వదిలేస్తున్నా
హోసన్న…

[RAP]
Everybody wanna know what'd be like feel like,
I really wanna be here with you…
It's not enough to say that we are made for each other,
It's love that is Hosanna true...
Hosanna…be there when you're calling out my name
Hosanna...feeling like me whole life has changed
I never wanna be the same...
It's time we rearrange...
I take a step
You take a step,
Im here calling out to you...
Hello...Halloo……Halloooooo…Yo…Hosanna..

రంగు రంగు చినుకులున్న మేఘానివై నువ్వు నింగి లోనే ఉన్నావుగా
ఓ తేనె గింజ పళ్లున్న కొమ్మల్లె పై పైన అందకుండా ఉంటావుగా
హోసన్న, ఆ మబ్బు వానావ్వదా
హోసన్న, ఆ కొమ్మ తేనివ్వదా
నా చెంత చేరవా
ఈ చింత తీర్చవా
ఏమంత నేను నీకు అంత కానివాణ్ణి కాదు గా
Hello… hello…hello…హోసన్న..

హోసన్న, ఆయువునే వదిలేస్తున్నా
హోసన్న, ఆశల్లో జీవిస్తున్నా
హోసన్న, ఆయువునే వదిలేస్తున్నా

ఈ హృదయం కరిగించి వెళ్లకే
నా మరు హృదయం అది నిన్ను వదలదే