Friday, March 20, 2015

జిలి బిలి పలుకుల (Sitara)



జిలి బిలి పలుకుల చిలిపిగ పలికిన  మైన మైన
కిల కిల నగవుల వలపులు చిలికిన  మైన మైన
మిలమిల మెరిసిన తార మిన్నుల విడిన సితార
మిలమిల మెరిసిన తార మిన్నుల విడిన సితార
మధువుల పెదవుల మమతలు విరిసిన  మైన  మైన
కలలను పెంచకు కలతను దాచకు ఏమైన  మైన

అడగనులే చిరునామా  మైన  మైన
చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నాకైనా
తారలకే సిగపువ్వ తారాడే సిరిమువ్వ
తారలకే సిగపువ్వ తారాడే సిరిమువ్వ
హరివిల్లు రంగుల్లో వర్ణాలే
చిలికిన చిలకవు ఉలకవు పలకవు  మైన ఏమైన

ఉరుములలో అలికిడిలా వినిపించే  మైన
మెరుపులలో నిలకడగా కనిపించే  మైన
యెండలకే అల్లాడే వెన్నలలో త్రినీడ
యెండలకే అల్లాడే వెన్నలలో త్రినీడ
వినువీధి వీణల్లొ రాగంలా
ఆశల ముంగిట ఊహల ముగ్గులు నిలిపేన ఏమైన

జిలి బిలి పలుకుల చిలిపిగ పలికిన  మైన మైన
తొలకరి వయసుల మిణుగురు సొగసులాడేమైన మైన
మిలి మిల మెరిసిన తార మిన్నుల విడిన సితార
గుడికే చేరని దీపం పడమటి సంధ్యా రాగం
మధువుల పెదవులు మమతలు విరిసిన  మైన  మైన
చుక్కలు అందక దిక్కున దాగిన నేనేలే  మైన